No comments yet

All is yours

కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి ( 2 కోరింది 3:21)

2 పేతురు 1:3 ఈ విధముగా చెప్పుచున్నది. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవానిగూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని ‘కావలసినవాటినన్నిటిని’ మనకు దయచేయుచున్నందున,…’
పై వచనము యొక్క రెండవ భాగము చూడండి ‘మన జీవముకు మరియు భక్తికి కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున..” ఈ మాట అపూర్వమైనది మరియు అసాధరణమైనది ! పాస్టర్ రవి ఇది నిజమా? ముమ్మాటికి నిజమే. ఎందుకంటే దేవుడే ఇది చెప్పెను.
ఈ వాక్య ప్రకారము మీరు కొదవ మరియు లేమిలో ఉండకూడదు. సమస్తము మీవైనప్పుడు మీ పిల్లల ఫీజుకు కొరత ఎలా వస్తుంది? సమస్తము మీవైనప్పుడు మీ వ్యాపారము దివాలా ఎందుకు తీస్తుంది? సమస్తము మీవైనప్పుడు మీ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టుటకు ఎవరికోసమో ఎందుకు చూడాలి? సమస్తము మీవైనప్పుడు మీ వ్యాపారము మొదలు పెట్టుటకు డబ్బు కోసం ఎందుకు ఏడవాలి ఎవరినో ఎందుకు యాచించాలి?
సమస్య ఏంటంటే నీకు తగినంత నమ్మకము లేకపోవుట. ఎప్పుడైతే దేవుని వాక్యమును విశ్వసించుటకు సాహసిస్తావో నిజంగా సమస్తమూ నీవవుతాయి. సమస్తమూ మారతాయి. ఇదేదో ఒక కట్టు కధనో లేదా జోక్ కాదు. సమస్తమూ నిజముగా మీవి. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. పిల్లలమైతే దేవుని వారసులము. అంతే కాదు క్రీస్తు తోటి వారసులము( రోమా 8:17). ఈ ప్రపంచమంతా ఆయనకు చెందినదే. హగ్గయి 2:8 లో ఆయన ఈ విధముగా చెప్పుచున్నాడు, ‘ వెండి నాది, బంగారు నాది…’. అవి కూడా నీవే. ఎందుకంటే నీవు ఆయన తోటి వారసుడవు.
నీ కుడి చేయి నీ హృదయము మీద పెట్టి ఈ విధముగా విశ్వాసముతో పలకండి, ‘ సమస్తమూ నావి. నా జీవముకు మరియు భక్తికి కావలసినవన్నియు నాకు దయచేయబడియున్నవి’. ‘మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను’ ( కీర్తన 16:6). యేసు నామములో ఆమెన్ !
అయితే, పాస్టర్ రవి గారు దేవుడు ‘మన జీవముకు మరియు భక్తికి కావలసినవన్నీమనకు ఏ విధముగా దయచేయును? అని మీరు ప్రశ్నించవచ్చు. దయచేసి 2 పేతురు 1:3 యొక్క మొదటి భాగమును గమనించండి, ‘మనలను పిలిచినవానిగూర్చిన అనుభవజ్ఞానమూలముగా’. అంటే దేవుని పట్ల దేవుని వాక్యము పట్ల జ్ఞానము ఎంతో అవసరము . నీవు ఎప్పటికీ సమృద్ధిలోను మరియు పోరిలి పారే అనుభవములో ఉండాలంటే ఇదే నీకు తాళం చెవి. కాబట్టి ఆయన వాక్యములో నిలబడు, ఆయన వాక్యమును చదువు, ప్రతి రోజు ఆయన వాక్యమును ధ్యానించు.
 

– పాస్టర్ రవి

సిటి చర్చ్

Post a comment