Comments are off for this post

Did JESUS visit India ?

యేసు తన 12-29 ఏండ్ల మధ్యకాలములో భారత దేశానికి వచ్చాడని, హిందూ మరియు బౌద్ధ గురువుల గురువుల యోద్ధ యోగా నేర్చుకొని స్వదేసమునకుతిరిగి వెళ్లి వాటిని ఇతరులకు బోధించి అభ్యాసము చేసాడని కొన్ని వదంతులు కలవు. ఆలాగే యేసు గురువుల వద్ద రాజయోగ (మూడు దినములు శవము ఉండి తిరిగి లేచు విద్య) నేర్చుకున్నాడని, ఆ విద్య వలెనే యేసు మూడు రోజులు మరణించి తిరిగి లేయగలిగాడని మరొక వదంతి కాదు. ఇది సాధ్యమా? అసలు ఈ వదంతి ఎక్కడనుండి పుట్టినది?Download

నికొలాస్ నోటోవిచ్ వాదన

1894లో నికొలాస్ నోటోవిచ్ అను రష్యా నవలా రచయిత  వ్రాసినThe  unknown Life of Christ అను పుస్తకము ఈ వాదమునకు తెరలేపెను.  మొదట ఈయన గారు వ్రాసిన దానిలో నిజమెంతో తేలుద్దాం.

 1. నోటోవిచ్ చరిత్ర కారుడు కాదు. ఒక నవలా రచయిత . చరిత్ర మీద ఏ అవగాహణ లేని వ్యక్తి వ్రాసిన వ్రాతలను చారిత్రక పత్రాలుగా (Historical Documents) పరిగణలోనికి తీసుకోగలమా? అవి ప్రామాణికమైనవిగా భావించగలమా? ఆలోచించండి.
 1. నోటోవిచ్ చెప్పిన ప్రకారము భారత దేశమునకు దగ్గరలోని టిబెట్ నందు కొన్ని చుట్టలు (Scrolls) బయటపడ్డాయని , యేసు టిబెట్ ద్వారా భారత దేశానికి వచ్చి బౌద్ధ మతాన్ని స్వాలంభాన చేసుకున్నట్టు అందులో వ్రాయబడినదని చెప్పెను. ఇక్కడ సత్యమేమిటంటే, 7వ శతాబ్దము వరకు బౌద్ధ మతం టిబెట్ కు చేరనే లేదు. ఇదే విషయం బౌద్ధ రచయిత క్రిస్మస్ హంఫ్రేస్ తన పుస్తకములో ప్రస్తావించేను ( పెంగ్విన్ 1962 ). జాన్ స్నెల్లింగ్ అనే మరో బౌద్ధుడు కూడా ఇదే విషయాన్ని దృవీకరిస్తూ ‘బౌద్ధ మతం యొక్క అంశాలు’  అను అర్ధమిచ్చే The elements of Buddhism అనే పుస్తకములో 33-34 వ పేజీలో ప్రస్తావించెను. మరి ఇలాంటప్పుడు మొదటి శతాబ్దానికి చెందిన యేసు అప్పటికి  టిబెట్ లో లేని బౌద్ధ మతాన్ని ఏ విధముగా స్వాలంభన చేసుకోగలడు ? ఆలోచించండి.
 1. ఇక చుట్టల విషయానికి వస్తే, నోటోవిచ్ చెప్పిన దేశములోని ఆ కాలపు ప్రజలు వాస్తవానికి వారు తాటి ఆకులనే వాడేవారు కాని చుట్టలను కాదు.  చరిత్ర తెలిసిన వారెవరైనా దీనిని తప్పక అంగీకరిస్తారు దీనిని బట్టి నోటోవిచ్ వ్రాసినది ఎంత కల్పితము అని తెలుసుకోవచ్చు.
 1. అప్పటికే నొటోవిచ్ వ్రాసిన పుస్తకము పెద్ద దుమారం రేగడం, క్రైస్తవ విశ్వాసము దెబ్బ తీసేదిగా ఉండడముతో,  నోటోవిచ్ వాదనను నిగ్గు తేల్చుటకు 1895లో ఆగ్రా లోనున్న ప్రభుత్వ కళాశాలలో పనిచేసిన జేమ్స్ ఆర్చిబాల్డ్ డౌగ్లాస్ అను ప్రొఫెసర్ కంకణం కట్టుకొనెను. ఈ ప్రయత్నములో భాగముగా అతడు చుట్టలు దొరికాయని ఏ ఆశ్రమం గురించి నోటోవిచ్ తెలిపాడో అదే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న పీటాధిపతిని ఇంటర్వ్యు చేసెను. ఆ ఇంటర్వ్యు లో యేసు గురించిన చుట్టలు ఏ మాత్రము అక్కడ దొరకలేలేదని,  నోటోవిచ్ చెప్పిన కధ అపద్దమని తేలెను. డోగ్లాస్ ఈ విషయాన్ని ప్రపంచానికి దృవీకరించుట కొరకు ఆ పీటాదిపతి  నుండి అఫిడవిట్ కూడా తీసుకొనెను.  ఆయన తన పరిశోధనా సత్యాలను ఏప్రిల్ 1896లో  ప్రముఖ పత్రిక అయిన The Nineteenth Century లో ప్రచురించగా సత్యము వెలుగులోనికి వచ్చెను.
 1. నోటోవిచ్ తన పుస్తకములో పేర్కొనినట్లు యేసు మన దేశానికి వచ్చి ఇక్కడి గురువుల యొద్ద యోగా నేర్చుకొని తిరిగి వెళ్లి వాటిని అభ్యాసము చేసేననుట హాస్యాస్పదము. ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాము. అతడు  కళాశాలకు వెళ్లి గణితాన్ని నేర్చుకొని కొంత కాలానికి  ప్రొఫెసర్ అవుతాడు. ఇప్పుడు అతనిని బోధించుమని అడిగితే  అతను ఏమి బోధించును?. ఖచ్చితంగా గణితమే. సైన్స్ బోధించుమని అతనిని ఎవరు అడగరు. ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చానంటే, యేసు భారత దేశానికి వచ్చి ఇక్కడ యోగా ధ్యానం వంటివి నేర్చుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వెళ్లియుంటే,  అక్కడ ఆయన ఏమి బోధించాలి? ఈ దేశములో నేర్చుకున్న విద్యను ,యోగాను యోగాను మరియు విశ్వాసమును బోధించాలి. కాని ఆయన ఇవేవీ బోధించినట్లు బైబిల్లో కనిపించదు. పైగా ఆయన పాత నిబంధన ప్రవచానములనే ఎక్కువగా బోధించెను.
 1. అసలు ఆయన పాత నిబంధన పై పటుత్వాన్ని ఎప్పుడు సంపాదించెను? ఆయన ధర్మశాస్త్ర విషయమై ఇశ్రాయేలు పెద్దలను సైతం నోరు మూయిం చినట్లు మనకు బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. ఇతంటి పాండిత్యము, జ్ఞానము ఆయన కు ఎక్కడి     నుండి వచ్చెను? వీటిని ఆయన ఎప్పుడు అభ్యాసము చేసెను? ఆయన భారత దేశానికి వచ్చినప్పుడు ధర్మ శాస్త్రమును   కూడా వెంట తెచ్చుకొని ఇక్కడ నేర్చుకున్నాడా? ఆలోచించండి.  ఒక వేళ ఆయన ఇక్కడ నేర్చుకొనిననూ ఆయన దేశములో   వాటిని అక్కడ వాటిని బోధించలేదు అని మీరు వాదించచ్చు. అట్లయితే ఆయన ఇంత దూరము వచ్చి నేర్చుకొనుటలో     లాభమేమి? ఒకరు నేర్చుకున్న విద్యను పంచుతేనే కదా అది సార్ధకమవుతుంది. ఆలోచించండి.

బైబిల్ ఆధారములు

పై వివరాలను సమీక్షించిన మీదట నోటోవిచ్ వ్రాసిననవి తప్పని, అవి కేవలం కట్టు కదలని రుజువయినైది. యేసు 18 ఏండ్ల ఈ మధ్య కాలములో యేసు తన  స్వదెసమును విడిచి ఎక్కడికి పోలేదనుటకు బైబిల్లో ఆధారములు కలవు.

   1. లూకా 2:51 లో ఆయన నజరేతుకు వచ్చి తన తల్లి దండ్రులకులోబడెను’ అని ఉన్నది.లూకా 4:16 లో ఆయన నజరేతులో పెరిగెను’ అని ఉన్నది. సాధారణముగా యూడుడైన ప్రతి బాలుడు ఏ విధముగా తన తల్లిదండ్రులకు లోబడి, తండ్రి వృత్తిని నేర్చుకొనునో యేసు కూడా తన 30వ ఏట వరకు ఆయన తల్లి దండ్రులకు లోబడియుండి తన తండ్రి వద్ద వడ్రంగి పనిని నేర్చుకొనెను.

   2. ఒక వేళ యేసు నిజంగా ఈ 18 ఏండ్లు వారి మధ్య లేక పోయుంటే , యేసు పరిచర్యలో మొదటి సారి నజరేతు సమాజ మందిరములో నిలువబడి గ్రంధపు చుట్టలను చదివినప్పుడు అక్కడున్న వారందరూ మరియు ఆ ఊరి ప్రజలు ఆయనను  ఇతడు వడ్రంగి వాని కుమారుడు’  అని గుర్తు పట్టి యుండే వారు కాదు. అయితే వారు గుర్తు పట్టారని బైబిల్ చేబుచున్నది. మరియు చిన్నతనములో బాలునిగా వెళ్ళిపోయి 30 ఏండ్ల వ్యక్తిగా తిరిగి వచ్చిన ఆయనను వారు గుర్తుపట్టుట సాధ్యమేనా?   లెదు. యేసు వారి కళ్ళ ముందు పెరిగాడు కాబట్టి గుర్తుపట్ట గలిగారు.  అదీ కూడా అతని  వృత్తిని బట్టి. దీనిని బట్టి యేసు తన వృత్తిలో ఏ విధముగా అందరికీ సుపరిచితుడో తెలియచున్నది. యేసు 18 ఏండ్ల మధ్య కాలములో తన స్వదేసములోనే ఉన్నాడని, ఎన్నడూ మన దేశమును దర్శించ లేదని ఇది రుజువవు చేయు చున్నది.

   3. యేసు వాడుక చొప్పున“ సమాజ మందిరమునకు వెళ్ళను అని లూకా 4:16 లోఉన్నది. ఒక వేళ ఆయన 30 ఏట ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వచ్చియుంటే సమాజ మందిరమునకు వాడుక చొప్పున ఏ విధముగా పోగలడు? ఆయన వాడుక చొప్పున వెళ్ళినది సమాజ మందిరానికే గాని గుళ్ళకు కాదు.

   4. యేసు ఈ లోకానికి వచ్చి నేనే మార్గము, నేనే సత్యము మరియు నేనే జీవము అని బోధించెను గాని నేను కూడా మార్గమని చెప్పలెదు. ఆయనే మార్గమైనప్పుదు వేరొక మార్గము కొరకు ఎందుకు మన దేశముకు వచ్చును? ఆలోచించండి.

   5. యేసు శిష్యులు సిలువను గురించి ప్రకటించుచూ క్రీస్తుకు హతసాక్షులు ఆయిరి. ఒక వేళ యేసు సిలువ వేయబడక మన దేశానికి వచ్చి ఇక్కడే మరణించి యుంటే శిష్యులు తమ వృత్తిని కుటుంబాలని విడిచి, అబద్దాన్ని ప్రకటిస్తూ, అబద్ధము కొరకు మరించేవారు కాదు ప్రపంచములో బైబిల్ మీద దాడి జరిగినంతగా ఇతర ఏ పుస్తకము మీద దాడి జరగలేదు. ఎన్నో రాజ్యాలు , ఎందరొ ప్రముఖులు దీనిని నాశనం చేయుటకు ప్రయత్నిచారు. చివరికి వారే నాశన మయ్యారు. బైబిల్ ఇప్పటికీ నిలచె ఉంది . ఎప్పటికీ నిలచె ఉంటుంది.

     గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలచును” (యెషయా 40:8)

Comments are closed.