Comments are off for this post

History of the Telugu Bible

అనువాద శాస్త్రానికే  అలంకారము తెలుగు  బైబిల్    Invalid download ID.

భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనము భాష. ఈ సర్వ సృష్టి దైవ వాక్కు ద్వారా ఉనికిలోనికి వచ్చినది. భాష ద్వారా దేవుడు మానవునితో సంభాషించాడు. బైబిలు ద్వారా తనను తాను మానవునికి ప్రత్యక్షపరచుకున్నాడు. పాత నిబంధన కాలములో అప్పటి ప్రజలకు అర్థమయ్యేలా హిబ్రూ భాష ద్వారా, క్రొత్త నిబంధన కాలములో గ్రీకు భాష ద్వారా మాట్లాడాడు. ఈనాడు ఆయా భాషా ప్రజలతో వారి వారి భాషల్లో బైబిలు అనువాదాల ద్వారా మాట్లాడుచునే ఉన్నాడు.

తెలుగు బైబిల్ మన భాషలోనికి ఏలా వచ్చిందో మీకు తెలుసా? అయితే తప్పక తెలుసుకోవలసిన భాద్యత ప్రతి క్రైస్తవునికి ఎంతైనా ఉంది. ఎందుకనగా  బైబిలు అనువాదము కొరకు ఎంతో మంది  ప్రాణాల్ని సైతం ధారా పోశారు.

బైబిలు అనువాదాన్ని తెలుసుకునే ముందు అనువాదమంటే ఏమిటో తెలుసుకోవటము  అవసరము. అనువాదమంటే ఒక భాషలోని  విషయాన్ని మరో భాషలో ప్రకటించటం. తెలుగులో దీన్ని తార్జుమా లేక భాషాంతీకరణ   అని కూడా అంటారు.

అనువాదమూ చాలా ప్రాచీనమైనది . బాబెలులో దేవుడు భాషలను తారుమారు చేసిన తరువాత అనువాదాల ఆవశ్యకతను మానవుడు గుర్తించాడు. అనువాద ప్రాచీనతకు ఒక ఉదాహరణ ఎస్తేరు గ్రంధము 8:9 లొ కనిపిస్తుంది. “సీవాను అను మూడవ నెలలో వ దినమందు రాజు యొక్క వ్రాత గాండ్రు పిలువబదిరి. మొర్ధకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూదేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న సంస్థానాల్లో నున్న అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానాలకు దాని దానివ్రాతను బట్టియు, దాని దాని భాషను బట్టియు తాక్కీడులు వ్రాయబడెను.”

అనువాదాల ద్వారా ప్రపంచములోని శాస్త్ర, సంస్కృతి, విజ్ఞానం, వార్తలు, క్రీడలు, వినోదాలు ఎన్నెన్నో విషయాలు మానవుని ఉమ్మడి  సొత్తు అవుతాయి. అందుకే ఆధునిక యుగం “అనువాద యుగము” గా పిలువబడుచున్నది.

ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న అనువాద చరిత్రలో బైబిలు అనువాదానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది.
భాష శాస్త్రజ్ఞుల (Linguists) అభిప్రాయము ప్రకారము నేడు వాడుకలో ఉన్న భాషలు 6912. వాటిలో అత్యధిక భాషల్లోకి అనువదించబడ్డ  ఏకైక గ్రంధము బైబిలు మాత్రమే. మీరు సర్వలోకానికి వెళి, సర్వ సృష్టికి సువార్తను అందించండి అన్న యేసు ప్రభువు వారి ఆఘ్ననుసారముగా  మిషనరీలు దేశ భాషలన్నీ నేర్చుకుని బైబిల్ని తార్జుమా చేసి మనకు అందించారు. తద్వారా అనేకులు దైవ వాక్యాన్ని చక్కగా అర్థము చేసుకుని  క్రీస్తునందు విస్వాసముంచగల్గుతున్నారు .

Bible Translations         

 1. ఇంగ్లీషు బైబిలు అనువాదాలు
 2. తెలుగు బైబిలు అనువాదాలు

ఇంగ్లీషు బైబిలు అనువాదాలు

ప్రారంభములో కేడ్మన్, ఆల్డెన్, బెడి,ఆల్ఫ్రెడ్, ఆర్మిన్లు ప్రారంభములో అనువాదము చేసినా ఏవీ ముద్రింపబడలేదు. పైగా ఇవన్నీ  మతాధిపతుల కొరకు చేయబడ్డవే గానీ సామాన్య మానవుని ఉపయోగార్ధము చేయబడ్డవి కావు.

జాన్ వైక్లిఫ్ఫ్  ( John Wycliffe)

జాన్ వైక్లిఫ్ఫ్ రోమన్ క్యాధలిక్కు కుటుంబములొ జన్మించెను. వృత్తి రిత్యా oxford కళాశాలలో Professor గా పనిచేసేను. ఇతను రోమా సంఘపు తప్పుడు బోధలను బాహాటముగా ఖండించడము, అలాగే వీరు చేస్తున్న వాక్య విరుద్ధమైన పనులను తీవ్రంగా  విమర్శించటం, వీటి గురించి ప్రజలలో చైతన్యము కలుగునట్లు బహిరంగ ప్రదేశాలలో మాట్లాడడము లాంటివి చేశాడు. బైబిలు మత పెద్దలకే కాదు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని భావించాడు. బైబిల్ను ఇంగ్లీషులోనికి అనువదించిన మొట్టమొదటి వ్యక్తి జాన్ వైక్లిఫ్ఫ్. ఇతను చేతితో వ్రాసిన ప్రతులు చర్చి మత పెద్దలు అనగ త్రోక్కెంత వరకు  ఎంతో ప్రజాదరణ పొందాయి. జాన్ వైక్లిఫ్ఫ్. జీవించి యున్నాప్పుడు ఇతనిని ఎవరూ  ఏమీ చెయ్యలేకపోయారు కాని , జాన్ వైక్లిఫ్ఫ్  చనిపోయి తరువాత  ఇతనంటే అస్సలు గిట్టని అప్పటి పోపు 44 సంవత్సరముల తరువాత జాన్ వైక్లిఫ్ఫ్ ఎముకలను త్రవ్వించి పొడి పొడి చేసి స్విఫ్ట్ నదిలో (River Swift)పారబోసేను.

జాన్ హస్స్ ( John Huss)

జాన్ వైక్లిఫ్ అనుచరుల్లో ఒకడైన జాన్ హస్స్ తన గురువు ఆశయాలను ముందుకు  తీసుకు వెళ్ళెను. ప్రజలందరూ  తమ తమ భాషలో  బైబిల్ను కలిగి ఉండాలని,  రోమన్ చర్చి యొక్క బెదిరింపులను తప్పుడు బోధలను ఎదుర్కొనాలన్న వైక్లిఫ్ఫ్ భావాలను అనేకులకు తెలియచేసేను.

ఇది ఓర్వలేని మత పెద్దలు, 1517లో, జాన్ హస్సను చలి కాచుకోను కర్రలతో  నిలువునా తగలబెట్టిరి.అదే మంటలో జాన్ వైక్లిఫ్ఫ్ అనువదించిన పత్రాలను కూడా తగలబెట్టిరి . తాను చనిపోతూ తాను అన్న చివరి మాటలు:
” ఒకో సంవతరాలలో దేవుడు ఇంకొకరిని లేపుతాడు. అతని  వలన వచ్చే గొప్ప విప్లవాన్ని ఎవరు ఆపలేరు”

అన్నట్టుగానే దేవుడు మార్టిన్ లూధర్ను లేపి గొప్ప విప్లవాన్ని తీసుకు వచ్చాడు..

జోహాన్ గుటెన్బర్గ్  (Johann Gutenberg)

1450 లో జోహాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రము కనుగొనెను. మొట్ట మొదట తన యంత్రములో ముద్రింపబడిన పుస్తకం బైబిల్. . లాటిన్ భాషలో ఇది ముద్రింపబడినది. అయితే కొంత కాలమైన తరువాత, ఇతని స్నేహితులే మోసము చేసి ఇతని వ్యాపారమును లాగేసుకొని కటిక పెదరికములోనికి నెట్టారు.

జాన్ కోలేట్ (John Colet)

1496 లో, Oxford University, London లో Professor గా పనిచేయుచున్న జాన్ కోలేట్ మొదట  తన విద్యార్థుల కొరకు అలాగే తన తన చర్చి వారు తమ భాషలో వినునట్లు,   బైబిల్ను గ్రీకు భాష నుంచి ఆంగ్లములోనికి అనువదించెను. తమ సొంత భాషలో దేవుని వాక్య ము వినటానికి అప్పట్లో  6 నెలల్లో దాదాపు 20,000 మందితో చర్చి కిక్కిరిసిపోఎది. ఇంకొందమంది చర్చి బయటే నిలబడి వాఖ్యము వినేవారు.

అయితే ఇప్పుడు కేవలం 700 మంది మాత్రమే హాజారవుతుండడం చాలా బాధాకరం.ఇందులో పర్యటకులే ఎక్కువగా ఉండడం విశేషం.

విల్లియం టిన్ డెల్ (William Tyndale)

ఇతను ఒక గొప్ప ఆత్మీయ నాయకుడు  ఇతను ఎంత గొప్ప జ్ఞాని అంటే ఇతనికి 8 భాషలు వచ్చు.హెబ్రీ , గ్రీకు , లాటిను ,స్పానిష్ ,ఇటాలియన్, ఇంగ్లీష్ ,జర్మన్ భాషలు వచ్చు.ఎంత అనర్గ లముగా  మాట్లాడగలడు అంటే ఏ భాష మాట్లాడినా  ఇదే అతని మాతృ  భాష అని అందరూ అనుకుంటారు. ఇతనే బైబిల్ను ఇంగ్లీషు భాషలో ముద్రించిన తొలి వ్యక్తి.

విలియం మత పెద్దలతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనేను. ఒకానొక సందర్భములో ఒక మత పెద్ద విలియంను అవమానిస్తూ,నీవు అచ్చు వేసిన దేవుని శాషనాలు లేకుండా ప్రజలు బతకగాలరేమో కాని పోపులు లేకుండా బ్రతకలేరుఅని చెప్పెను. అందుకు విలియం ఒక వేళ దేవుడు నా ఆయుషును ఇంకాస్త పెంచుతే, ఒక పిల్లవాడికి లేఖనములో మంచి తర్ఫ్హీదును ఇచ్చి మీ పోపుకంటే గొప్ప వాడినిచేయగలనుఅని చెప్పెను. ఈ మాట అన్నందుకు ఇతను ఇంగ్లాండ్  దేశము నుండి వెళ్ళగోట్టబడెను.

చివరికి ఫిలిప్పు అను ఇతని సొంత స్నేహితుడే ఇతనిని ఇంగ్లాండ్ రాజునకు పట్టించెను. 500 దినాలు ఒక పాకలొ
అతి హీనమైన పరిస్తులలో బందీగా ఉంచబడెను. అక్టోబర్ 6, 1536లో, ఇతను బంధింపబడిన  పాకను తగలబెట్టి సజీవ దహనము చేసిరి. ఇతని చివరి మాటలు ” దేవా, ఈ దేశపు రాజు కన్నులే తెరువుము”.ఇతని  ప్రార్థనకు  ఫలితముగా  1539 లొ ఇంగ్లండు రాజు హెన్రీ  రక్షింపబడి ఆయన ఆధ్వర్యములో “గ్రేట్ బైబిల్” అనే ఇంగ్లీష్ బైబిలు ముద్రింపబడెను.

మార్టిన్ లూధర్ (Martin Luther)
లూదరు ప్రారంభ దినాలు
ఇతని తండ్రి ఒక రైతు. తన కొడుకు బాగా చదువుకొని సివిల్ ఉద్యోగములో చేరి తన కుటుంబమునకు మంచి పేరు తేవాలని తనఆ తండ్రి ఎంతో కస్టపడి చేదివించెను. ఉన్నత చదువులు చదివిన లూదరు, ఒక రోజు తన కళాశాల నుండి తిరిగి వస్తుండగా, తనకు అతి దగ్గరలో గొప్ప శబ్దముతో పిడుగు పడెను. భయముతో గట్టిగా కేకలు వేసి ” అమా! అనీ, కరుణించు , నేను నీ సేవ చేస్తాను” అని అనెను.

తన ప్రాణము దక్కించుకున్నాను అన్న ఆనందముకంటే, తాను తొందరపడి ఇచ్చిన మాటనుబట్టి బాధపడెను. మాట ప్రకారము తన చదువును విడిచిపెట్టి సేవా ఆశ్రమములో చేరెను.

లూధరుకు సమాధానము లేకపోవుట
మంచి పనులు చేయుట ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి మరియు అనేకుల  ఆత్మల రక్షణ కొరకు ప్రార్ధించటానికి  లూదరు తన జీవితాన్ని పూర్తిగా సేవకు అర్పించెను. ఇంత చేసిన మనసులో సమాధానము ఉండేది కాదు. నిత్యము ఉపవాసములు, దీర్ఘ ప్రార్థనలు, పవిత్ర యాత్రలు, మరియు జప మాల చేస్తూనే ఉండేవాడు. ఎంత ఎక్కువ చేస్తే అంతా వెల్తి ఇతనిలో కనిపించేది.

లూదరు పరిస్ధితి గమనించిన తన గురువు, ఆధ్యాత్మిక తర్ఫీదు చేస్తే మనసు దృష్టి మల్లించబడుతుందని సలహా ఇవ్వగా, వెళ్లి వేదాంత కళాశాలలో చేరి విద్యను పూర్తి చేసెను. అటుతరువాత ఫాదరుగా అభిషేకింపబడి ,Wittenberg university లో ధియాలజి బోధించడం ప్రారంభించెను. దీనితో పాటు ధియాలజిలొ బ్యాచిలర్ డిగ్రీతో  పాటు డాక్టరు ఆఫ్ ధియాలజి కూడాపొందుకొనేను.తాను బోధించు వృత్తిలో ఉండెను గనుక లేఖనములు మరింత లోతుగా అధ్యయనము చేయవలసి వచ్చెను. అప్పుడు చర్చి వారు లేఖనములకు విరుద్ధముగా కొన్ని విషయములలో తప్పిదములు చేయుచున్నారని గ్రహించి వాటి గురించి చర్చించడము  మొదలు పెట్టెను. కొన్ని సందర్భములో బాహాటముగా ఖండించెను.

లూదరు వ్రాసిన ’95 నిరూపిండబడలేని సిద్ధాంతాలు’
1917లొ, Halloween దినమందు లూదరు క్యాధలిక్కు చర్చీల తప్పులను ఎత్తి చూపుతూ తాను వ్రాసిన ‘నిరూపించాబడలేని సిద్ధాంతాలు’ వెళ్లి చర్చి వాకిలి మీద మీకుతో గొట్టిదించెను. అది సామాన్య ప్రజలందరికి అర్థమయ్యేలా వ్రాయబడి ఉండెను.  అప్పటి నుంచే ప్రారంభమైనది Protestant గుంపు. Protest అనగా వ్యతిరేకించడము. జాన్ వైక్లిఫ్, జాన్ హస్స్, జాన్ కోలేట్ లాంటి వారు ఈ ఉద్యమానికి పునాది వేసినవారైతే, లూదరు దీనిమీద కట్టువాడుగా ఉనాడు.

నేను నిలబడ్డాను

దీనిని వ్యతిరేకించిన అప్పటి పోపు, తాను చేసినవి తప్పని తెలుసుకుని వదిలిపెట్టమని లేదంటే న్యాయ సభలో వివరణ ఇచ్చుకొనవలసిన  పరిస్ధితి ఉంటుందని హెచ్చరించెను. అయితే విచారనకే లూదరు ఇష్టపడెను. న్యాయ సభలో లూధరును ప్రవేశ పెట్టినప్పుడు, అధికారి ” నీవు చేయుచున్న పనిని సమర్ధించు కొనుచున్నావా?” అని అడిగెను. అందుకు లూదరు దీనివిషయమై ఆలోచించడానికి కాస్త సమయము ఇవ్వమని కోరెను. సమయము ఇవ్వబడగా, లూదరు ప్రార్ధనలో కనిపెట్టి తనస్నేహితులతో శ్రేయోభిలాషులతో సంప్రదించి మరుసటి రోజు తిరిగి న్యాయ సభలో ప్రవేశపెట్టబడెను.

అధికారి తరిగి అదే ప్రశ్న లూధరును అడుగగా, లూదరు జవాబిస్తూ, “నేను చేసిన పనుల మీద వస్తున్న వదంతులు, తీవ్రవిమర్శల విషయమై క్షమాపణ కోరుచున్నాను, అయితే నాది తప్పని లేఖనముల ద్వారా రుజువు చేస్తే తప్ప  తన మనశాక్షికి వ్యతిరేకముగా పనిచేయడము నా వాళ్ళ కాదు. ఈ సత్యము కోసము నేను ఎంతకైనా  నేను నిలబడతాను.ఇంతకు మించి నేను ఏమీ చేయలేను. ఇక దేవుడే నాకు సహాయము చేయాలి” అని చెప్పెను.

ఆ దినాల్లో సామాజిక అధికారము కంటే మత అధికారమే ఎక్కువగ ఉండేది గనుక, అధికారులు ఇతనిని తమ ప్రాంతము నుంచి బహిస్కరించెను.

బహిష్కరింపబడుట
జనసాంద్రత లేని అనే ప్రాంతములోనికి లూధరును బహిస్కరించెను. అయినా  పట్టు వదలని లూదరు బైబిలును జర్మన్ భాషలోనికి అనువదించెను.తన స్నేహితులు అప్పుడప్పుడు సలహాలు,  అభిప్రాయముల కొరకు ఇతనికి ఉత్తరములు వ్రాయుచుండేడు వారు. లూదరు హత శాక్షిగా మరణించలేదు గాని, వయస్సు మీద పడిన మీదట వ్రుద్ధ్యాప్యములో మరణించెను.

లూదరు వలన వచ్చిన ఈ విప్లవము వలెనే నేడు Protestant వచ్చారు.ఎంతగా అనువాదమును అనుగాద్రోక్కాలని ప్రయత్నిస్తే అంతకు అంతగా ఇది విస్తరించడము ప్రారంభమైనది. అటు తరువాత బైబిల్ అనేక భాషల్లోకి అనువదించబడినది.

తెలుగు బైబిలు అనువాదాలు

క్రీస్తు శిష్యుడైన తోమా తరువాత భారత దేశానికి వచ్చినవారు రోమన్ క్యాధలిక్కులు. వీరు మొదట
భారతీయ భాషల్లోకి బైబిల్ను అనువదించలేదు. వీరి తరువాత వచ్చిన protestant మిషనరీలు ఈ అనువాద కార్యక్రమాన్ని చేపట్టారు. భారత దేశ భాషల్లోకి బైబిలును మొదటగా అనువాదము చేసినవాడు జీగెన్ బాల్గ్.  ఇతడు తమిళంలోనికి బైబిలు అనువదించాడు. ఈ విధముగా ప్రారంభమైన బైబిలు అనువాదము లిపి ఉన్న అన్నీ భారతీయ భాషల్లోకి అనువదించాబడటమే కాక లిపి లేని లంబాడి, కోయ, గోండి, కుపి, కొండ  దొర, గడబ లాంటి ఎన్నో భాషల్లోకి అనువదించబడటం నిజంగా విశేషము.
ఈ క్రింది అనువాదాలని పరిశీలిస్తే, తెలుగులో అన్ని అనువాదాలు వచ్చాయో తెలుస్తుంది.

బెంజమిన్ షూల్జ్ అనువాదము:
బైబిల్ను తెలుగులోనికి మొట్టమొదట అనువదించిన వాడు జర్మన్ లూధరన్ మిషనరీ అయిన డా బెంజమిన్ షూల్జ్   .
ఇతడు తెలుగు భాష నేర్చుకుని 20 ఏళ్ళు కృషి చేసి 1727 లో క్రొత్త నిబంధన, 1732 లో పాత నిబంధన అనువదించాడు. కాని అది ముద్రించబడలేదు. ఇప్పటికీ ఆ ప్రతులు జర్మనీలో ఉన్నాయీ. ఇతడు తెలుగు అనువాదానికి ముందు తమిళములో కూడా బైబిల్ను అనువదించాడు,

ఫిలిప్ ఫ్హేబ్రియాన్ అనువాదము:
ఇతడు 1742 లో జర్మనీ నుండి వచ్చిన లూథరన్ మిషనరీ. ఇతడు కూడా బైబిల్ను తెలుగులోనికి అనువదించాడు

కాని అది ముద్రించబడలేదు.

కెప్టెన్ డాడ్స్ అనువాదము :
ఇతడు ఈస్ట్ ఇండియా కంపెనిలో పనిచేసిన స్కాట్లండు దేశస్థుడు. తాను మిషనరీ కానప్పటికీ బైబిల్ను
తెలుగులోనికి అనువదించాలన్న అభిలాషతో 1795లో ఆరంభించాడు, కాని ఆ అనువాదము ముగించకుండానే జ్వర పీడితుడై మరణించాడు. ఆయన సహాఉద్యోగులకి అతని అనువాదము గురించి తెలియనందువల్ల ఆ కాగితాలను
కాల్చివేసారని పండితుల అభిప్రాయము.

విలియం కెరీ అనువాదము:
ఆధునిక ప్రేషిత పితామహుడుగా (Father of Modern Day Missions) పేరుగాంచిన విలియం కెరీ తెలుగులోనికి బైబిలును అనువదించాడు. ఇతడు ఇంగ్లాండు దేశస్తుడైన బాప్టిస్టు  మిషనరీ. ఇతడు 1793 నుండి 1834 వరకు 40 ఏళ్ళు  భారత దేశములో మిషనరీగా  పనిచేసి, 15 స్థానిక భాషల్లోకి బైబిలును అనువదించాడు. వాటిలో తెలుగు కూడా ఒకటి. అయితే ఇతను చేసిన పని ఎంతగా ప్రభావితము చేసినదంటే 1807లో బ్రౌన్ యూనివర్సిటీ వారు డాక్టర్ ఆఫ్ డివినిటీ పట్టాతో సన్మానించారు. ఇతనేదో గొప్పగా చదివాడని అనుకుంటున్నారా? కనీసము హైస్కూల్ విద్య కూడా చదవలేదు.. కెరీ 1805లో బైబిలును తెలుగు లోనికి అనువదింప మొదలెట్టి  క్రొత్త నిబంధనను, పాత నిబంధనలోని కొన్ని భాగాలను1890 లో ముగించాడు.1818 లో మొట్టమొదటిగా క్రొత్త నిబంధన తెలుగు భాషలో మద్రాసులో ముద్రింపబడినది. తరువాత మూడు సంవత్సరములకు 1821లో పాతనిబంధనలో మొదటి గ్రంధాలు తెలుగులో ముద్రింపబడ్డాయి .

కేరీ భారత దేశానికి వచ్చినప్పుడు ప్రవేశమునకు అనుమతి దొరకలేదు. మన దేశములో బ్రిటీషు దొరలూ పరిపాలిస్తున్న దినాలలో విదేశీయులు మన దేశాములోనికి ప్రవేశించాలంటే ఈస్ట్ ఇండియా కంపని అనుమతి పొందవలసినదే. అయితే ఈ అనుమతి మిషనరీలకు మాత్రము ఏ మాత్రము ఇచ్చేవారు కాదు.కేరీకి అనుమతి లభించకపోయినా ఎట్టకేలకు ప్రవేశించాడు.40 ఏళ్ళు మన దేశములోనే ఎనలేని సేవ చేసెను. తాను స్థాపించన సేరంపూర్ వేదాంత కళాశాల, ఆసియాలోనే మొట్టమొదటి కళాశాల. ఇప్పటికీ ఇది దిగ్విజయముగా నడిపింపబడుచున్నది.

జార్జి క్రాస్, ఆగస్టస్ డిగ్రాన్జేస్ అనువాదము:

వీరిద్దరూ లండన్ మిషనరీ సొసైటీ ద్వారా క్రైస్తవ్య ప్రచారార్ధము పంపబడ్డారు. క్రాస్ 1808 లో మరణించగా, ఈ అనువాద కార్య భారమంతా డిగ్రాన్జేస్ పైబడినది. బ్రాహ్మణ కులములో నుండి యేసును అంగీకరించిన ‘ఆనందరాయారు’ అనే తెలుగు పండితుని సహాయముతో ఇతడు బైబిల్ని అనువదించాడు. వీరి అనువాదమునకు ముందే వెలువడ్డ తమిళ బైబిలు కూడా వీరికి సహాయపడింది. డిగ్రాన్జేస్ 1810 సం జులై 12 న  వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఇతని మరణాంతరం 1812 లో నాలుగు సువార్తలు కలకత్తా కరస్పాన్డింగ్ కమిటీ  ఆర్ధిక సహాయముతో ముద్రింపబడి ప్రచురింపబడ్డాయి.

జాన్ గోర్డాన్, ఎడ్వర్డ్ ప్రిచేట్ అనువాదము:
డిగ్రాన్జేస్ జీవించియున్న కాలములో అతనికి సహాయంగా జాన్ గోర్డన్ను, డిగ్రాన్జేస్ మరణించిన తరువాత

ఎడ్వర్డ్ ప్రిచేట్ ను మిషనరీగా లండన్ సొసైటీ వారు విశాఖపట్టణం పంపించారు. వీరు 1817 లో  విశాఖపట్టణం చేరి ‘ఆనందరాయరు’  సహాయముతో బైబిలు అనువాదాన్ని ముగించారు. వీరు చేసిన అనువాదాన్ని1818 లో బైబిలు సొసైటీ వారు ప్రచురించారు.

బైబిలు సొసైటీ  వారి అనువాదము
1890 నుండి 1897 వరకు జరిగిన తెలుగు అనువాద ప్రయత్నాలేవీ ఫలించలేనందువల్ల  చివరిగా1898 లో ఎనిమిది సభ్యులతో ఒక ప్రత్యేక బైబిలు సవరణ సంఘము ఏర్పడినది. ఈ బైబిలు సవరణకు 5 1/2సంవత్సరములు పట్టినది. వీరు సవరించిన అనువాదము 1904 లో ప్రచురించబడినది.నేటి వరకు ప్రొటెస్టంటులంతా  ఉపయోగించే సంపూర్ణ బైబిలు ఇదే.  ఈ అనువాదము  చదువరుల అభిప్రాయ సేకరణ తరువాత 1911లో సర్వజనాగీకారము  పొందినది.

లివింగ్ బైబిల్స్ ఇండియా వారి అనువాదము:
1990 లో లివింగ్ బైబిల్స్ ఇండియా వారు తెలుగు బైబిలుని సజీవ భాషలో అంటే వాడుకలో ఉన్న తెలుగులో అనువదించారు.అదే పరిశుద్ధ బైబిలుగా ప్రచురించబడినది.

జి.ఆర్..క్రో అనువాదము:
1987 లో జి.ఆర్.క్రో అనే విదీశీయ మిషనరీ బైబిలును తెలుగు వాడుక భాషలో ‘ పవిత్ర గ్రంధము’ అనే పేరుతో ప్రచురించాడు. అదే బైబిలుని అతడే మరలా 1994 లో వ్యాఖ్యాన సహితంగా తిరిగి ప్రచురించాడు.

ఈ దశాబ్ధములో వ్యవహారిక భాషానువాద ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగులో ఇన్ని అనువాదాలు
రావడములో బైబిలు సొసైటీ వారి పాత్ర ఎంతో ఉంది. దేవుని వాక్యాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశముతో అన్నీ భాషల్లోనూ అనువాద కార్యక్రమాలు చేపట్టడమే కాక అనువదింపబడ్డ బైబిళ్ళను ముద్రించి తక్కువ వేలకు విక్రయిస్తూ అందరికీ అందుబాటులో ఉండేట్టు చేస్తున్నారు.

ఈ విధంగా బైబిలు అనువాదము నాన్నాటికి ఎంతో అభివృద్ధినొందుతూ అనువాద శాస్త్రానికే అలంకారప్రాయంగా వెలుగొందుతుంది.

బైబిలు గురించి ఆసక్తికరమైన సత్యాలు

బైబిల్లో మోత్తము అధ్యాయాలు                                                   :     1189

పాత నిబంధనలో మోత్తము అధ్యాయాలు                                     :     929

కోర్త నిబంధనలో మోత్తము అధ్యాయాలు                                       :     260

బైబిల్ అంతటిలో అతి పొడవైన అధ్యాయము                                 :     కీర్తన119

బైబిల్ అంతటిలో అతి చిన్న అధ్యాయము                                     :     కీర్తన 117

బైబిలులో అతి పొడవైన వచనము                                              :     ఎస్తేరు 8:9

బైబిలులో అతి చిన్న  వచనము                                                 :     యోహాను 11:35

బైబిలులో అతి పొడవైన పదము                                                 :     మహేరు షాలాల్ హాజ్ బజ్ (యెషయా 8:1)

బైబిల్ అంతటిలో మధ్య అధ్యాయము                                          :     కీర్తన 118

118 కీర్తనకు ముందు ఉన్న అధ్యాయాలు                                    :     594                                                    :

118 కీర్తనకు తరువాత ఉన్న అధ్యాయాలు                                   :     594

మోతము కలిపితే ( మధ్య అధ్యాయము)                                      :     1188(594+594)+1(మధ్య అధ్యాయము)=1189

బైబిల్ అంతటిలో మధ్య వచనము                                               :     కీర్తన 118:8

మనుష్యులను నమ్ముకోనుతకంటే యెహోవాను ఆశ్రయించుట  మేలు

ఎక్కువ ఆదరణం కలిగించే అధ్యాయాలు                                       :     కీర్తన 23 ;యోహాను 14

ప్రేమ గురించి ఎక్కువగా చెప్పిన అధ్యాయము                               :     కోరంది 13

విశ్వాసము గురించి ఎక్కువగా చెప్పిన అధ్యాయము                       :     హెబ్రీ 11

బైబిలులో ఏ రెండు అధ్యాయాలు  ఒకేలా ఉనాయి                           :     2 రాజులు 19; యెషయా 37

బైబిలులో అతి బాధాకరమైన  వచనము                                       :     మార్కు 15:34

బైబిలులో దేవుడు అన్న  పదము అన్ని సార్లు                            :     4,370

బైబిలులో యెహోవా  అన్న  పదము అన్ని సార్లు                         :     6,855

బైబిలులో ప్రభువు  అన్న  పదము అన్ని సార్లు                          :     7,736

మరిన్ని వివరాలు

 1. బైబిలునే ఏకధాటిగా గట్టిగా చదివితే గంటలలో చదువవచ్చు.
 1. యేసును ఎంతమంది జ్ఞానులు దర్శించినది బైబిలులో ప్రస్తావించలేదు. అయితే పండితులు 3 అని చెబుతూ ఈ ముగ్గురి జ్ఞానుల పేర్లు ప్రస్తావించిరి.
  1. మేల్కొయిర్ ( అనగా వెలుగునకు రాజు అని అర్ధము) ఇతను బంగారము సమర్పించెను
  2. గాస్పెర్ ( అనగా తెలుపు అని అర్ధము) ఇతను సాంబ్రాణి సమర్పించెను.
  3. బెల్తాజార్ (అనగా ధననిదికి అధిపతి) ఇతను బోలమును సమర్పించెను.
 1. యేసుతో పాటు ఇద్దరు దొంగలు ఇరుపక్క సిలువ వేయబడ్డారు. ఈ ఇద్దరి దొంగల పేర్లు డిస్మాస్ (Dismas) మరియు గెస్టస్ (Gestas).
 1. వోల్టైయీర్(Voltaire) అనే  ఫ్రెంచి ప్రముఖ సిద్ధాంతవేత్త (philosopher) ఒక హేతువాది. ఈయన బైబిలును సమూల నాశనము చేసి భూమి మీద ఉండకండ పూర్తిగా తుడిచిబెడతానని  బెదిరించెను.అయితే అతను మరణించిన తరువాత ఇతను ఏ ఇంటిలో అయితే జన్మించాడో, అదే ఇంటిని బైబిలు సొసైటి వారు కొనుగోలు చేసెను. ఇప్పుడు బైబిలును ఎక్కువగా అమ్ము దుకానముగా ఇది ఉన్నదది.
 1. ఉప్పు అనే పదము బైబిలులో దాదాపు 30 సార్లు కంటే ఎక్కువగా ప్రస్తావించబడినది.
 1. బైబిలులో మోత్తము 7 ఆత్మ హత్యలు గురించి ప్రస్తావించబడినది.
 1. బైబిలులో ప్రస్తావించబడని ఒకే ఒక పెంపుడు జంతువు ‘పిల్లి’
 1. ‘భయపడకుడి’ అనే  పదము 365 సార్లు వ్రాయబడినది .
 1. ‘సెలా’ అనే పదము 74 సార్లు వ్రాయబడినది.
 1. ఎస్తేరు గ్రంధమందు మరియు పరమ గీతములోను ‘దేవుడు’ అనే పదము ఒక్క సారి కూడా కనిపించదు.

 

 

 

 

 

 

 

 

 

 

Comments are closed.