Comments are off for this post

Why Four Gospels?

New Microsoft Office PowerPoint Presentation

29 పుస్తకములతో ఇమిడిన క్రొత్త నిబంధన మత్తయి ,మార్కు ,లూకా మరియు యోహాను సువార్తలతో పరిచయమవుతుంది .సువార్త  అనగా ‘మంచి  వార్త‘ లేదా ‘శుభవార్త ‘. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు  సువార్త . ఒకే కాలములలో  జరిగిన ఒకే జీవిత కథకు దేవుడు నాలుగు సువార్తలు ఎందుకిచ్చేనని చాలా మందికి సందేహము కలదు. వాస్తవమునకు అవి నాలుగు వేరు వేరు విషయములనువ్రాయలేదు గాని  ఒకే సువార్త లేదా ఒకే కథకు  నాలుగు వివరములైవున్నాయి . అయితే  ప్రతి సువార్త విభిన్నమైన దృష్టి ,వేర్వేరు శ్రోతలను మనస్సులో ఉంచుకొని వ్రాయబడినవి.

ఇవి  నాలుగు రకములైన శ్రోతల కొరకు నాలుగు కోణములలో వ్రాయుటకు 2 కారణములు కలవని నేను తలంచుచున్నాను .

                                       1.యెహెఙ్కేలు దర్శనము 

యెహెఙ్కేలు దేవుని సింహాసనము చుట్టూ  ఉన్న నాలుగు జీవుల ముఖమునకు చెందిన దర్శనమును  చూచెను.

నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటిది,కుడిపార్శ్యపు ముఖములు  సింహ ముఖము వంటివి. యెడమ పార్శ్యపు ముఖములు వంటివి .నాలుగింటికి పక్షిరాజు ముఖములవంటి ముఖములు  కలవు (యెహెఙ్కేలు  1:10).

ఈ నాలుగు జీవుల ముఖములు ,నాలుగు సువార్తలలో ఉన్న యేసుక్రీస్తు యొక్క నాలుగు వ్యక్తిత్వాలను సూచిస్తున్నవి .అవి ఏమిటో విపులముగా చూద్దాము.

  1. సింహ ముఖముమత్తయి సువార్త

సింహము  అడివికి రాజు. అటువలెనే యేసు దావీదు వంశమునకు చెందిన రాజని ,వాగ్దానము చేయబడిన రక్షకుడని యూదులకు రుజువు చేయుటకు మత్తయి ఈ సువార్తను వ్రాసెను . అందుకే ఈ సువార్తలో రాజ్యము ,దేవుని రాజ్యము ,నెరవేర్పు అను మూలపదాలు ఎక్కువగా కనిపించును.

ఈ సువార్త ప్రారంభములో వంశావళి పొందుపరచబడినది. కారణం యూదులు వంశావళికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చుదురు . యేసు తన వంశావళి చ్చొప్పున ఏవిధముగా యూదులకు రాజో నిరూపించటానికి మత్తయి అబ్రాహాము వంశ వృక్షమును మరియు దావీదు వరుకు వంశ వృక్షమును అందించెను.

మత్తయి సువార్తలో యేసు రాజుగా చిత్రింపబడెను గనుక ‘మత్తయి సువార్త ‘ అను శీర్షిక క్రింద ఇదిగో నీ రాజు “(జెకర్యా 9:9) అను వాక్యమును ఉపశీర్షికగా చేర్చితే చక్కగా సరిపోతుంది 

  1. ఎద్దుముఖముమార్కు  సువార్త  

మార్కు తన సువార్తను అన్యులైన రోమీయులకు వ్రాసెను. ఇతర సువార్తికులు గ్రీకు పదాలు వాడిన చోట ఈయన లాటిన్ పదాలు వాడెను. సాధారణముగా అన్యులు సేవకునిలో పనితనము చూచుదురుగాని అతని వంశము మీద,ఆయన వ్యక్తిగత వివరములు మీద మరియు ఆయన పలుకు మాటల మీద పెద్ద లక్ష్యము ఉంచరు . అందుకే మార్కు తన సువార్తలో యేసు వంశావళిని,ఆయన బాల్యము గురించిన వివరములను మరియు కొండ మీద ప్రసంగము లాంటి వివరములు పొందుపరచక, ఒక సేవకుడిగా ఆయన చేసిన అనేక కార్యముల గురించే ఎక్కువగా వ్రాసెను.

మార్కు యేసు శ్రమించే ఎద్దుగా వర్ణించెను. ఎద్దు పాత నిబంధనలో ప్రాముఖ్యమైన బలిపశువు. కాబట్టి మార్కు సువార్తలో యేసు శ్రమపడిన రక్షకుడిగాను ,బలులను నెరవేర్చిన సేవకుడిగాను వర్ణించబడుచున్నాడు. 

  1. మానవ ముఖములూకా సువార్త  

లూకా తన సువార్త గ్రీకు వారికి వ్రాసెను. యేసు దేవుడైయుండి మనలను రక్షించుటకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఒక ‘మానవునిగాఈ లోకమునకు వచ్చేనని,ఆయన ఈ లోకములో ఉన్నంత వరుకు ఆయన పరిపూర్ణమైన మనుష్య కుమారుడనిరుజువు చేయుటకు లూకా యేసు వంశవృక్షమును ఆదాము వరుకు పొందుపరిచెను.

లూకా సువార్తలో యేసు మనుష్య కుమారునిగా చిత్రింపబడెను గనుక ‘లూకా సువార్త‘ అణు శీర్షిక క్రింద దిగో మనుష్యుడు (యోహాను 19:5) అను వాక్యమును ఉపశీర్షికగా చేర్చితే చక్కగా సరిపోతుంది.  

  1. పక్షిరాజు ముఖముయోహాను సువార్త  

యోహాను తన సువార్తను,ప్రపంచములో సర్వ కాలములో సర్వ ప్రజల కొరకు వ్రాసెను.  అన్యులకు వంశావళితో పని లేదు గనుక యోహాను తన సువార్తలో వీటిని పొందుపరచలేదు. యిచ్చాను యేసును ఉన్నత స్థలములలో ఎగురు పక్షిరాజుతో పోల్చుతూ ఆయనకు దేవుని కుమారుడిగా వర్ణించెను.యేసు దైవత్వము మీద మరియు ఆయనకు తండ్రితో ఆయనకున్న అనుబంధము మీద ఇతర సువార్తికుల కంటే యోహాను ఎక్కువగా వివరించెను.

యోహాను సువార్తలో యేసు దేవుని కుమారుడిగా చిత్రింపబడెను గనుక ‘యోహాను సువార్త‘ అణు శీర్షిక క్రింద ఇదిగో మీ దేవుడు“(యోహాను 35:4) అను వాక్యమును ఉపశీర్షికగా చేర్చితే చక్కగా సరిపోతుంది.  

                                                  2. ప్రత్యక్ష గుడారము

ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించుటకు ఒకే ద్వారము కలదు. ఈ ద్వారము సన్ననార, నీలిరంగు,ధూవ్ర వర్ణము,రక్తవర్ణముఅనే నాలుగు రంగులతో కూడిన అందమైన ద్వారము (నిర్గమ 27:16) ఈ ద్వారము మీద ఉన్న నాలుగు రంగులు నాలుగు సువార్తలలో యేసు క్రీస్తు జీవితమును నాలుగు కోణములో వర్ణించుచున్నవి. అదేలాగో చూద్దాము.

  1. ధూమ్రవర్ణము

దీనిని ఊదారంగు అని కూడా అందురు. నీలిరంగును రక్తవర్ణమును కలుపుట వలన ఈ రంగు  ఏర్పడును. ఈ రంగు రాజరికమును సూచించుచున్నది (న్యాయాధి 8:26,యోహాను 19:2). మత్తయి సువార్త యేసును దావీదు రాజరిక వంశమునకు చెందినవాడుగా నిరూపించెను (మత్తయి 1:1). కాబట్టి ధూమ్ర వర్ణము మత్తయి సువార్తను సూచిస్తున్నది.

  1.  రక్తవర్ణము 

ఇది రక్తము మరియు బలి అర్పణను సూచించుచున్నది. యేసు క్రీస్తు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనుని మార్కు 10:45 వివరించుచున్నది. అలాగే మార్కు సువార్త అంతటిలో ఆయన అందరి కొరకు ప్రాణము పెట్టిన యెహోవా సేవకునిగా వర్ణించుచున్నది. కాబట్టి రక్త వర్ణము మార్కు సువార్తను సూచిస్తున్నది.

  1. సన్ననార

ఇది తెలుపు రంగు కలది.  తెలుపు పవిత్రతను, నీతిని సూచించుచున్నది (ప్రకటన 19:8). లూకా సువార్తలో  పొంతి పిలాతు  యేసును ఉద్దేశిస్తూ    మనుష్యుని యందు నాకే నేరము కనబడలేదు అని చెప్పెను (లూకా 23:4). కాబట్టి తెలుపు లేక సన్ననార లూకా సువార్తను సూచిస్తున్నది.

  1. నీలిరంగు

నీలిరంగు భావము గ్రహించుటకు కష్టమేమి కాదు. ఆకాశమువైపు చూడండి, యేసు క్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు అనియు ( 1కోరంథి 15:47)మహిమా స్వరూపి‘ అనియు (2:8) పిలవబడుచున్నాడు. యోహాను సువార్తలో తోమా యేసుక్రీస్తును నా ప్రభువా నా దేవాఅని పిలిచెను (యోహాను 20:28). యోహాను సువార్త అంతటిలో యేసును దేవుని కుమారునిగా చిత్రింపబడెను. గనుక నీలిరంగు యోహాను  సువార్తను సూచిస్తున్నది

        COMPARISON OF FOUR GOSPELS

rdgds

Comments are closed.